సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (13:15 IST)

నందమూరి ఫ్యామిలీ నుంచి బుల్లిహీరో-త్రివిక్రమ్ సినిమాలో అభయ్ రామ్

''రాజా ది గ్రేట్'' సినిమాలో రవితేజ కుమారుడు మహాధన్ వెండితెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కూడా మెహబూబా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తె

''రాజా ది గ్రేట్'' సినిమాలో రవితేజ కుమారుడు మహాధన్ వెండితెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కూడా మెహబూబా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇలా సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం కొత్తేమీ కాకపోయినా.. నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రానున్న నేపథ్యంలో.. తాజాగా బుల్లి హీరో ఇదే ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆయన ఎవరో కాదు.. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్. ఫిలిమ్ నగర్‌లో ఇదే హాట్ న్యూస్‌గా మారిపోయింది. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా... జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా పూజాదికాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభిరామ్ నిలిచిన సంగతి తెలిసిందే.