మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:31 IST)

''శ్రీనివాస కల్యాణం'' విడుదలకు ముహూర్తం కుదిరింది..

శ్రీనివాస కల్యాణం సినిమా జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని దర్శకనిర్మాతలు తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ ''శ్రీనివాస కల్యాణం'' రూపుదిద్దుకుంటోంది. క్లా

శ్రీనివాస కల్యాణం సినిమా జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని దర్శకనిర్మాతలు తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ ''శ్రీనివాస కల్యాణం'' రూపుదిద్దుకుంటోంది. క్లాస్, మాస్, యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా, గోదావరి జిల్లాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  తాజాగా చంఢీగర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా రాశి ఖన్నా, మరో కథానాయికగా నందిత శ్వేత నటిస్తున్నారు.

ఈ సినిమా జూలై 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సినీ యూనిట్ నిర్ణయించింది. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సక్సెస్‌ నితిన్‌ కెరీర్‌కు కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.