శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (10:10 IST)

హిట్స్ లేని సమయంలో ధైర్యం చెప్పారు.. ఆయనే నా దేవుడు : హీరో నితిన్

తన చిత్రాలు వరుస ఫ్లాప్‌లు అవుతున్న సమయంలో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యం చెప్పారనీ యువ హీరో నితిన్ చెప్పుకొచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ, కాలేజీలో చదువుకునే రోజుల నుంచి తనకు

తన చిత్రాలు వరుస ఫ్లాప్‌లు అవుతున్న సమయంలో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యం చెప్పారనీ యువ హీరో నితిన్ చెప్పుకొచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ, కాలేజీలో చదువుకునే రోజుల నుంచి తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని, ఆయన అభిమానినని చెప్పారు. పవన్‌ను చూసే తాను సినిమాల్లోకి రావాలని అనుకున్నానని.. అలాగే వచ్చానని తన సినిమాలు మంచి విజయాలు సాధించాయని చెప్పారు. అయితే, హిట్స్‌లేని సమయంలో తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. 
 
సాధారణంగా నా అభిమాన హీరో (పవన్ కల్యాణ్) ఎక్కువుగా బయటకు రారు, కానీ, నా సినిమా 'ఇష్క్' ఫంక్షన్‌కు ఆయన వచ్చారు. బాగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ రావడం వల్లే అసలు 'ఇష్క్' అనే సినిమా ఉంది, హీరో నితిన్ ఇంకా ఉన్నాడని తెలిసింది. ఆ సినిమాకు హైప్ వచ్చింది ఆయన వల్లే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారు దేవుడితో సమానం. అప్పుడు, నాకున్న బాధ నాకే తెలుసు. ఆ సమయంలో ఆయన (పవన్ కల్యాణ్) నాకు హెల్ప్ చేశారు' అని తన మనసులోని మాటను వెల్లడించారు.