మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (15:35 IST)

సరే.. పవన్ సలహానే పాటిస్తా.. జీవితతో లీగల్ పోరు ప్రారంభం: శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాను పాటిస్తానని.. తన న్యాయపరమైన పోరాటాన్ని సినీ నటి జీవిత రాజశేఖర్‌తో మొదలుపెడుతున్నానని శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి తెలిపింది. ఇకపై పవన్ కల్యాణ్ చెప్పినట్లే ఏమైనా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాను పాటిస్తానని.. తన న్యాయపరమైన పోరాటాన్ని సినీ నటి జీవిత రాజశేఖర్‌తో మొదలుపెడుతున్నానని శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి తెలిపింది. ఇకపై పవన్ కల్యాణ్ చెప్పినట్లే ఏమైనా సమస్యలుంటే చట్టపరమైన పోరాటం చేస్తానని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.
 
ఇక పవన్‌ను అనుకరిస్తానని.. పవన్‌ అమ్మగారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని.. తన తప్పును క్షమించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇక లీగల్ ఫైట్ పూర్తి ఆధారాలతో జీవిత రాజశేఖర్‌తో మొదలుపెడుతున్నానని తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది.
 
మరోవైపు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించిన సంగతి తెలిసిందే. బుధవారం మీడియాతో సమావేశమైన నాగబాబు.. ఆర్టిస్టుల కనీస సౌకర్యాలు కల్పిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని నిర్మాతల మండలి హామీ ఇచ్చినట్లు నాగబాబు తెలిపారు. 
 
కాస్టింగ్ కౌచ్, షూటింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఆడవాళ్లకు అన్నీ సదుపాయాలు కల్పంచాలని... కోఆర్డినేటర్ల ద్వారా కాకుండా ఆర్టిస్టులకు నేరుగా డబ్బులందేలా ఓ ప్రణాళిక ఆలోచించాలని చెప్పానని తెలిపారు.