మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:15 IST)

నాకు జనసేన సైన్యం ఉంది.. గన్‌మెన్లు అక్కర్లేదు : పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని ఆయన సమ్మతించలేదు. ఈ సెక్యూరిటీలో భాగంగా ఏపీ సర్కారు పవన్ కళ్యాణ్ భద్రత

జనసేన అధ్యక్షుడు, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని ఆయన సమ్మతించలేదు. ఈ సెక్యూరిటీలో భాగంగా ఏపీ సర్కారు పవన్ కళ్యాణ్ భద్రత కోసం గన్‌మెన్లను కేటాయించింది. ఈ గన్‌మెన్లను పవన్ మంగళవారం రాత్రి వెనక్కి పంపించారు. 
 
నిజానికి నెల రోజుల క్రితం గన్‌మెన్లను కేటాయించాలని ఆ రాష్ట్ర డీజీపీకి పవన్ లేఖ రాశారు. దాంతో ఇటీవలే పవన్ భద్రతకు సంబంధించి నలుగురు గన్‌మెన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఉన్నట్టుండి గన్‌మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. జనసేన కార్యకర్తలు పవన్‌కు రక్షణ కవచంలా ఉండటం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.