శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (11:09 IST)

పవన్‌కు శ్రీరెడ్డి సారీ చెప్పాల్సిందే.. గబ్బర్ సింగ్ గ్యాంగ్ వార్నింగ్ (వీడియో)

జనసేన పార్టీ చీఫ్, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై... ఆయన తల్లిపై నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పాలన

జనసేన పార్టీ చీఫ్, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై... ఆయన తల్లిపై నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పాలని ''గబ్బర్ సింగ్'' సినిమాలో రౌడీ గ్యాంగ్‌గా నటించిన నటులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశారు.
 
ఆ వీడియోలో ఏమన్నారంటే ''హాయ్, మేము మా దేవుడి టీమ్.. గబ్బర్ సింగ్ టీమ్. ఈరోజు శ్రీరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం... నువ్వు ఎన్ని సినిమాలు చేశావు? నీ ముఖం ఎక్కడ చూడలేదన్నారు. 
 
అంతేగాకుండా పవన్ కల్యాణ్ అమ్మ గురించి నువ్వు మాట్లాడతావా? ఒక ఆడదానివై ఉండి ఇలా మాట్లాడతావా? తోటి ఆడవారిపై గౌరవం ఇవ్వడం శ్రీరెడ్డికి తెలియదా..? శ్రీరెడ్డి పవన్‌కు సారీ చెప్పాలని.. అప్పటిదాకా ఊరుకునే ప్రసక్తే లేదని గబ్బర్ సింగ్ గ్యాంగ్ శ్రీరెడ్డిని హెచ్చరించారు.