శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (17:10 IST)

మెహ్రీన్‌కు ఆఫర్ల వెల్లువ.. గోపిచంద్, వెంకటేష్, విజయ్‌కి తర్వాత నితిన్‌తో రొమాన్స్

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ శ్రీనివాస కల్యాణం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటిస్తుంది. నితిన్ సొంత బ

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ శ్రీనివాస కల్యాణం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటిస్తుంది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. 'శ్రీనివాస కల్యాణం' షూటింగ్ పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని టాక్. 
 
ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మధ్య గ్లామర్ హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన మెహ్రీన్... ప్రస్తుతం గోపిచంద్‌తో పంతం, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కే మల్టీస్టారర్, విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ''నోటా''లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ ఎఫ్2 అనే మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ రావడంపై మెహ్రీన్ హర్షం వ్యక్తం చేసింది.
 
ఎందుకంటే..? రాజా ది గ్రేట్ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడినే ఎఫ్-2 సినిమాకు డైరక్టర్ కావడంతో మెహ్రీన్ సంతోషానికి హద్దుల్లేకుండా పోయింది. 2016లో అనిల్ రావిపూడి ''రాజా ది గ్రేట్'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.