శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 21 ఏప్రియల్ 2018 (21:20 IST)

రాజమౌళి వెంటబడ్డ మిల్కీ బ్యూటీ... ఎందుకు?

బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని సాధించాయో చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో నటించిన తమన్నాకు మంచి క్రేజ్‌ను తెచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు అనుష్క, తమన్నా. బాహుబలి-1లో మిల్కీ బ్యూటీ నటనను తెలుగు ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. అలాంట

బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని సాధించాయో చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో నటించిన తమన్నాకు మంచి క్రేజ్‌ను తెచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు అనుష్క, తమన్నా. బాహుబలి-1లో మిల్కీ బ్యూటీ నటనను తెలుగు ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. అలాంటి భారీ విజయం తరువాత తమన్నాకు పెద్దగా విజయాలు లేవు. అటు తమిళంలో కూడా తమన్నా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో తమన్నా విజయం కోసం ఎదురుచూస్తోంది.
 
చివరకు మిల్కీ బ్యూటీ దర్శకుడు రాజమౌళి వెంట పడిందట. నాకు మంచి హిట్ కావాలి. అది మీవల్లే సాధ్యమని చెబుతోందట. ప్రభాస్ లాంటి హీరోలతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఆలస్యమైనా ఫర్వాలేదు. మీరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తరువాత మా ఇద్దరితో ఒక సినిమా చేయండి అంటోందట తమన్నా. తమన్నాపై మంచి అభిప్రాయం ఉన్న రాజమౌళి కాస్త సమయం అడిగారట. రాజమౌళి తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యాక తమన్నాతో సినిమా చేయనున్నారని, అయితే సమయం మాత్రం ఎక్కువగా పడుతుందని అంటున్నారు మౌళి సన్నిహితులు.