శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (14:36 IST)

ఎన్టీఆర్ - చరణ్‌ అలా చేయకూడదని నిర్ణయించుకున్నారట...

దసరాకు ఎన్టీఆర్ సినిమా రానుంది. మరి చరణ్‌ బోయపాటి సినిమా కూడా అదే టైంలో వస్తుందా. చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ పెరిగిందంటున్నారు సినీవర్గాలు. ఇది ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఉంటుందా. వీరి మధ్య ఇక పోటీ ఉండదా... ఎన్టీఆర్, చరణ్‌ పోటీ పడొద్దని అన

దసరాకు ఎన్టీఆర్ సినిమా రానుంది. మరి చరణ్‌ బోయపాటి సినిమా కూడా అదే టైంలో వస్తుందా. చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ పెరిగిందంటున్నారు సినీవర్గాలు. ఇది ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఉంటుందా. వీరి మధ్య ఇక పోటీ ఉండదా... ఎన్టీఆర్, చరణ్‌ పోటీ పడొద్దని అనుకుంటున్నారా... ఇద్దరి మధ్యా ఫ్రెండ్లీ అండస్టాండింగ్. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దసరా కానుకగా విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ తన సినిమాలను దసరాకే విడుదలకు చేస్తున్నారు. 
 
రంగస్థలం సినిమాతో భారీ హిట్ కొట్టిన చరణ్‌ కూడా ఇప్పుడొక సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో సినిమాను మొదలుపెడుతున్నారు. హీరోతో అవసరం లేని సీన్లను ఇప్పటికే తీస్తున్నారు బోయపాటి. ఈ మూవీ కోసం కండలు పెంచుతున్న చరణ్‌ ఈ నెల 21 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారట. ఈ మూవీ కూడా అక్టోబర్ నెలకు విడుదలవుతోంది. అక్టోబర్ నెల నాటికి సినిమా రెడీ అయినా ఎన్టీఆర్ సినిమాతో పోటీ పడకూడదని చరణ్‌ నిర్ణయించుకున్నారట. ఇద్దరి సినిమాల మధ్య మూడు వారాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ఇంతకుముందు పోటీ పడేవారు.. ఇప్పుడు అస్సలు అలాంటివి చేయకూడదన్న నిర్ణయానికి ఇద్దరూ వచ్చేశారట. రాంచరణ్‌, ఎన్టీఆర్ త్వరలోనే కలిసి నటించనున్నారు. రాజమౌళి కొత్త సినిమాలో వీరిద్దరు హీరోలు. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోక ముందు నుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేదట. మరి ఇప్పుడు మరింత థిక్ ఫ్రెండ్స్ అయిపోయారట.