మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (17:26 IST)

'భరత్ అనే నేను' చిత్రంలో అలాంటి సీన్సా .. అబ్బో అంటున్న రాజమౌళి

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి వీక్షించ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి వీక్షించ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
"ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ లాంటి ఇష్యూస్‌ని లేవనెత్తాలంటే చాలా ధైర్యం కావాలి. కొరటాల శివ, మహేష్ బాబును వారి నమ్మకాన్ని అభినందిస్తున్నా. చాలా మంచి మూమెంట్స్ ఉన్న ఈ సినిమాలో ప్రెస్‌మీట్ సీన్ ది బెస్ట్. మహేష్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చాడు. నటీనటులంతా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్‌లో బాగా ఒదిగిపోయారు. దానయ్యగారికి, 'భరత్ అనే నేను' టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 
 
కాగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా, కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గలేదనే టాక్ నడుస్తోంది.