'భరత్ అనే నేను' ఆ రికార్డ్ సాధించడం ఖాయం - నిర్మాత దానయ్య
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ.
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ... జంబలకిడి పంబ సినిమాతో నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసాను. ఈ జర్నీ ప్రారంభించి 25 సంవత్సరాలు అయ్యింది. మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పటికి నెరవేరింది.
ఓ మంచి సినిమాని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక భరత్ అనే నేను సినిమా విషయానికి వస్తే... ఈ కథ ఎవర్ని ఉద్దేశించి కాదు. డైరెక్టర్ కొరటాల శివ చాలా మంచి స్ర్కిప్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. అందరికీ నచ్చుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు... తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు అసలు ఈ నెల 20న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అని తెలియదు.
అదే రోజు మహేష్ బాబు గారి అమ్మ గారి పుట్టినరోజు అని కూడా తెలియదు. మహేష్ బాబు గారు చెప్పాకే తెలిసిందన్నారు. రంగస్థలం రికార్డును భరత్ అనే నేను క్రాస్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది... మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు... రంగస్థలం రికార్డుని బ్రేక్ చేస్తుందో లేదో చెప్పలేను కానీ... మహేష్ బాబు కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలుస్తుందని మాత్రం చెప్పగలను అన్నారు.