శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:03 IST)

మ‌హేష్ ఆ డైరెక్ట‌రుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. ఈ సినిమా జూన్ నెలలో స్టార్ట్ కానుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్‌ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
అయితే... ఈ స‌స్పెన్స్‌కి తెర దించుతూ వంశీ పైడిప‌ల్లితో చేయ‌నున్న సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసాడు. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసాడు. ఆత‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే... సుకుమార్ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డితో చేస్తాడా... లేక త్రివిక్ర‌మ్‌తో చేస్తాడా అనేది తెలియాల్సివుంది.