శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: మంగళవారం, 22 మే 2018 (14:53 IST)

రమణదీక్షితులుపై వేంకటేశ్వరుడే కన్నెర్ర చేశారా?

రమణదీక్షితులు. తిరుమల కొండపై దేవుడు తరువాత దేవుడు అంతటి వాడు అనుకునేవారు. ఎవరికి ఆ స్వామివారి దర్శనభాగ్యం కలగాలన్నా ముందుగా రమణ దీక్షితులను దర్శనం చేసుకోవాలి. భక్తుడికి, భగవంతుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చక పదవిలో ఉన్న రమణదీక్షితులు అత్యంత అవమానకరంగా

రమణదీక్షితులు. తిరుమల కొండపై దేవుడు తరువాత దేవుడు అంతటి వాడు అనుకునేవారు. ఎవరికి ఆ స్వామివారి దర్శనభాగ్యం కలగాలన్నా ముందుగా రమణ దీక్షితులను దర్శనం చేసుకోవాలి. భక్తుడికి, భగవంతుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చక పదవిలో ఉన్న రమణదీక్షితులు అత్యంత అవమానకరంగా టిటిడి నుంచి బయటపడ్డారు. అయితే రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తవమెంత. రమణదీక్షితులకు అందుతున్న మద్దతెంత? 
 
ఆ కలియుగ వేంకటేశ్వరస్వామికి కోటానుకోట్ల మందికి భక్తులు ఉన్నారు. వారందరూ ఇంతకాలం టిటిడి ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కూడా తమవారు అనుకునేవారు. అంతటి గౌరవ మర్యాదలు, అంతటి భక్తిభావంతో కూడిన టిటిడి ప్రధాన అర్చక పదవికి రమణదీక్షితులు కళంకం తెచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఐతే అది ఎలాంటిదన్నది స్పష్టత లేదు. 
 
ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడం ద్వారా ఏకంగా జిఓనే తెచ్చి 65 యేళ్ళు నిండినవారు అర్చక వృత్తిలో కొనసాగ కూడదంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రమణదీక్షితులకు ఆ పదవి పోయింది. ఉన్న అధికారిక హోదా పోవడంతో దీక్షితులు విమర్శలకు పదునుపెట్టారు. టిటిడి ఆలయ భద్రత పట్ల, స్వామివారి ఆభరణాల పట్ల, స్వామివారికి జరిగే కైంకర్యాల పట్ల అనేక ఆరోపణలను గుప్పించారు. అయితే వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ ఖండించారు టిటిడి ఈఓ. 
 
రమణదీక్షితులకు ప్రస్తుతం అండగా నిలిచేవారే లేరా. అర్చకుల్లో ఆయనకు మద్ధతు తెలిపేవారే కరువయ్యారంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వంశపారపర్యంగా వస్తున్న తమ పదవిని తొలగించడానికి ప్రభుత్వానికి హక్కు లేదంటూ రమణదీక్షితులు ఆరోపిస్తుంటే కనీసం వారి వంశస్తుల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించడం లేదు. ఇందుకు కారణాలు ఏమిటనేది తెలియాల్సి వుంది. మరోవైపు రమణదీక్షితులపై వేంకటేశ్వరుడే కన్నెర్ర చేయడంతో ఆయన పదవి పోయిందనే ప్రచారమూ జరుగుతోంది.
 
ఏదేమైనప్పటికీ రమణదీక్షితులు ప్రస్తుతం తన వాదనలకు మద్ధతు ఇచ్చేవారు లేక కష్టాలు పడుతున్నారు. టిటిడితో కయ్యానికి కాలుదువ్విన రమణదీక్షితులు ఒంటరివాడుగా మిగిలిపోయారు. అయితే తన పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తానంటున్నారు. రమణదీక్షితులు ఒంటరిగా పోరాటాన్ని చేస్తున్నారు. ఆయన వెంట గతంలో ఎంతోమంది అర్చకులు ఉంటే వారందరూ ఇప్పుడు రమణదీక్షితులకు రివర్సయిపోయారు. దీంతో రమణదీక్షితులు ఒంటరివారై పోయారు. వారసత్వంగా వచ్చిన అర్చకత్వాన్ని రమణదీక్షితులు ఏవిధంగా కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే.