శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 22 మే 2018 (12:11 IST)

గులాబీ వజ్రం జెనీవాలో వుందట.. రమణ దీక్షితులు ఆమరణ దీక్ష?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి.. గరుడోత్సవం సందర్భంగా అలంకరించే అరుదైన పింక్ డైమండ్ పగిలిపోయినట్లు రాసి.. అధికారులు దానిని విదేశాలకు తరలించారు. ఇటీవల ఆ వజ్రాన్ని జెనీవాలో వేలానికి ఉంచ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి.. గరుడోత్సవం సందర్భంగా అలంకరించే అరుదైన పింక్ డైమండ్ పగిలిపోయినట్లు రాసి.. అధికారులు దానిని విదేశాలకు తరలించారు. ఇటీవల ఆ వజ్రాన్ని జెనీవాలో వేలానికి ఉంచారని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 
పింక్ డైమండ్‌ను గత ఏడాది నవంబర్ 15న వేలానికి వుంచారని.. దాని యజమాని వజ్రాన్ని దక్షిణాప్రికా గనుల నుంచి తీసుకు వచ్చినట్లు క్లయిమ్ చేశారు. దీని బరువు 36.3 క్యారెట్లు. ఈ వజ్రానికి వేలంలో సరైన ధర లభించకపోవడంతో అమ్ముడు పోలేదు. వజ్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాణేలు విసరడం ద్వారా పగిలే అవకాశం లేదని రమణ దీక్షితులు అంటున్నారు. 
 
ఏదైనా బలమైన బరువుతో ఓ నిర్ణీత కోణంలో కొడితే, రెండు ముక్కలు కావచ్చేమో తప్ప, ముక్కలు ముక్కలుగా పగలడం అసంభవమని జెమాలజీ నిపుణులు కూడా చెప్తున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను తప్పుబడుతూ.. వారి నుంచి శ్రీవారి సంపదను పరిరక్షించాలని ఆరోపిస్తున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తన దూకుడు పెంచారు. 
 
ఢిల్లీకి వెళ్లి హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు తిరుమలలో జరుగుతున్న విషయాలపై ఫిర్యాదు చేసిన ఆయన, టీటీడీ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆభరణాలు అదృశ్యం కావడం, స్వామివారికి సేవల్లో లోపం జరుగుతుండటంపై సీబీఐ విచారణకు రమణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.