1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sudeep meets Pawan

పవన్ తో సుదీప్ భేటీ

Sudeep
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ వచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు.

వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.
తర్వాతి కథనం
ఆ కథనం చూశాక, ప్రజలు బుర్రలు పగులగొట్టుకుంటున్నారు: దివ్యవాణి