1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tadepalli To Bengaluru: Jagan To Create Record

బెంగళూరు పర్యటనతో రికార్డ్ కొట్టిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి

ys jagan
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు పర్యటనతో రికార్డ్ సృష్టించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత జగన్ 12వ సారి బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల కాలంలో జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లడం ఇది 12వ సారి. ఏపీలో కంటే జగన్ ఎక్కువ కాలం బెంగళూరు ప్యాలెస్‌లో గడుపుతున్నారు. 
 
వైసీపీ అధినేత జగన్ పుంగనూరుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వారం మళ్లీ ఏపీకి రావాల్సింది. కానీ పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. ఒకవేళ జగన్ పుంగనూరుకు వచ్చి వుంటే ఈ టూర్ 12వ సారి అయ్యివుంటుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ బెంగళూరు పర్యటనల్లో డబుల్ సెంచరీ (200) సులువుగా చేయగలరని సోషల్ మీడియాలో ఎన్డీయే కార్యకర్తలు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. సగటున, జగన్ దాదాపు సగం సమయం అక్కడే గడుపుతూ నెలకు మూడుసార్లు బెంగుళూరుకు వెళుతున్నారని టాక్ వస్తోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
హర్యానాలో క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠత... నువ్వానేనా అంటున్న కాంగ్రెస్ - బీజేపీ