ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:49 IST)

బస్సు కిటికీ లోపలికి దూరేందుకు యత్నించిన చిరుత పులి (Video)

Leapard leaping at safari bus
బస్సులో వున్నవారిని వణికించింది చిరుత పులి. బెంగళూరు నగరానికి శివారు ప్రాంతంలో వున్న బన్నేరుఘట్ట నేషనల్ పార్కులో ఆదివారం సాయంత్రం చిరుతపులి సఫారీ బస్సుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

బస్సు వెనుక కిటికీ తెరచివుండటంతో లోపలికి దూరేందుకు యత్నించింది. ఐతే కిటికీ అద్దాలకు ఇనుప గ్రిల్ వుండటంతో చిరుత ప్రయత్నం సఫలం కాలేదు. ఐతే చిరుత అలా బస్సుపైకి దాడికి యత్నించడం చూసి లోపల వున్నవారు జడుసుకున్నారు.