శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (19:01 IST)

స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టిన యువకుడు (Video)

ola showroom fire
కర్నాటక రాష్ట్రంలో మొరాయించిన బైకును రిపేరు చేయలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ స్కూటర్‌ను కూడా పక్షం రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అంతలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు కోసం షోరూమ్‌కు ఇచ్చాడు. అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు.. షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈఘటన కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్‌లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలుచేశాడు. అందులో మూడు వారాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్‌ను ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. 
 
అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షోరూమ్‌లోని ఆరు స్కూటర్లు దగ్ధమైపోయాయి. 
 
షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓలా షోరూమ్ తగలబడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.