1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP Leader KE Prabhakar tweet on YS Jagan Mohan Reddy

పీకినవాటిని పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ సిత్రాలు : కేఈ ప్రభాకర్

KE Prabhakar
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత తొమ్మిది నెలల కాలంలో పీకేసిన వాటిని పక్కదారిపట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు అంటూ ఎద్దేవా చేశారు. 
 
"చంద్రబాబుగారిపై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించి మీ బాబే (వైఎస్) ఏమి పీకలేక చేతులెత్తేశారు.
 
 
గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణ, ఐటి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమని, నువ్వు పీకిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా సిట్ వేశాక ప్రజలకు క్లారిటీ వచ్చింది. 
 
రాష్ట్రంలో మీరు పీకింది కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు. 
తర్వాతి కథనం
రేపల్లెలో జవాను కాల్పుల కలకలం.. రేప్ కేసు పెట్టిందనీ...