గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:10 IST)

రేపల్లెలో జవాను కాల్పుల కలకలం.. రేప్ కేసు పెట్టిందనీ...

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పుల కలకలం. ప్రేమించి మోసం చేసినందుకు రేప్ కేసు పెట్టిందన్న అక్కసుతో యువతి, ఆమె తల్లిపై ఓ ఆర్మీ జవాన్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ తల్లీబిడ్డను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నడుంపల్లి గ్రామానికి చెందిన మురాల రమాదేవి, ఆమె కుమార్తె నాగజ్యోతి ప్రేమకు నిరాకరించిందని కారణంతో నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాలాజీ కాల్పులు జరిపాడు. ఆర్మీలో పని చేస్తూ వివాహం చేసుకుంటానని నాగజ్యోతిని మోసం చేశాడు. 
 
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో గత డిసెంబర్లో బాపట్ల పట్టణ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. నాగజ్యోతి రేప్ కేసు పెట్టడంతో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన బాలాజీ శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత రివాల్వర్, మరణాయుధాలతో రమాదేవి ఇంటికి వచ్చి తల్లి, కుమార్తెపై కాల్పులు జరిపాడు. రమాదేవికి చెవి దగ్గర గాయమైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.