సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (16:32 IST)

నారా లోకేశ్‌పై వేటు.. డీఆర్సీ నుంచి ఉద్వాసన?

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్‌ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 
 
శనివారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం (గుంటూరు డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ-డీఆర్సీ)  సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకురాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జ్ మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.