సంబంధిత వార్తలు
- ఉత్తరాంధ్రకు రాజ్యాంగేతర శక్తిగా విజయసాయి రెడ్డి : టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
- ఏపీలో రాజ్యాంగ వ్యతిరేక పాలన : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్
- టీడీపీ హయాంలో అవినీతి జరిగితే, కేంద్రం నుంచి రూ.10వేలకోట్లు ఎలా తెచ్చారు?: రాజేంద్రప్రసాద్
- వైసీపీకి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
- మినిట్స్ బయటపెడితే ఎవరిది తప్పో తెలుస్తుంది: టీడీపీ ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు
టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా ఆమోదం
టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. గతంలో టిడిపి ఎమ్మెల్సీగా ఉంటూ వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన పోతుల సునీతపై అనర్హత వేటుకు మండలి చైర్మన్‌కు టిడిపి ఫిర్యాదు చేసింది.
దీనిపై మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తర్వాత సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దాన్ని మండలి చైర్మన్ ఆమోదించారు. ఏపీ శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్ షరీఫ్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు సభ నివాళులర్పించింది. అనంతరం సభను బీఏసీ కోసం వాయిదా వేశారు. అనంతరం సంతాప తీర్మాలను మండలి ఆమోదిస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ తెలిపారు. సభను మొత్తం ఐదురోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
తర్వాతి కథనం
