1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Telangana : Father Murdered His Son for second marraige

మరో పెళ్లి చేసుకోవాలని కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి...

కట్టుకున్న భార్యకు పుట్టిన మొదటి మగబిడ్డ మానసిక వికలాంగుడిగా పుట్టాడు. దీంతో ఆ కసాయి తండ్రికి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా కన్నబిడ్డను కడతేర్చాడు.

Telangana
కట్టుకున్న భార్యకు పుట్టిన మొదటి మగబిడ్డ మానసిక వికలాంగుడిగా పుట్టాడు. దీంతో ఆ కసాయి తండ్రికి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా కన్నబిడ్డను కడతేర్చాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా తాడూరు మండలపరిధిలోని గుతలపల్లి అనే గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి రాములమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి శివుడు (4) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు మతిస్థిమితం లేకుండా జన్మించాడు. దీంతో ఆ పిల్లాడిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో పొలంలో పని చేస్తున్న భార్య రాములమ్మతో గొడవపడ్డాడు. అపుడు అక్కడ ఉన్న శివుడికి నీళ్లలో గుళికలు తాపించడంతో బాలుడు మృతిచెందాడు. తల్లి రాములమ్మ మంగళవారం భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడిని తానే చంపాను అంటూ రాములు నేరాన్ని అంగీకరించాడు. 
 
మృతి చెందిన శివుడు మానసిక వికలాంగుడు కావడంతో భార్యతో గొడవపడి మరోపెళ్లి చేసుకోవాలనే దురుద్దేశ్యంతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఐరన్ స్కేలుతో కంటిపై కొట్టిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి