శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (17:59 IST)

సంగీత దీక్షకు నాలుగు రోజులు.. టీఆర్ఎస్ యూత్ లీడర్ దౌర్జన్యం (వీడియో)

బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాసరెడ్డి రెండో భార్య సంగీత నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తోంది. తన అత్తామామలు కట్నం కోసం వేధిస్తున్నారని.. ఏమిటని అడిగితే కొట్టి బయటికి గెంటేశారని.. సంగీత ఆరోపించింది

బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాసరెడ్డి రెండో భార్య సంగీత నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తోంది. తన అత్తామామలు కట్నం కోసం వేధిస్తున్నారని.. ఏమిటని అడిగితే కొట్టి బయటికి గెంటేశారని.. సంగీత ఆరోపించింది. అంతేగాకుండా తీవ్ర జ్వరంలో ఉన్నప్పటికీ.. బోడుప్పల్‌లో  శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన రెండో భార్య సంగీత ఆందోళన చేస్తోంది. 
 
న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లనని తెగేసి చెప్తోంది. అంతేగాకుండా తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక సంగీతకు వివిధ పార్టీల నుంచి, సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. పలువురు అక్కడికి చేరుకుని సంగీతకు మద్దతు తెలుపుతున్నారు.
 
అత్తమామలను తన ముందుకు తీసుకొచ్చి న్యాయం జరిపించాలని సంగీత డిమాండ్ చేస్తోంది. వారిని అరెస్ట్ చేస్తే లాభం లేదని, తనకు న్యాయం జరగడమే ముఖ్యమని చెప్తోంది. కూతుర్ని కంటే ఇంటి నుంచి గెంటేశారని తెలిపింది. తన భర్త తనను ఓ పని మనిషిగా చూశాడంది. తాను చాన్నాళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, తనకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకోవడంతో న్యాయం కోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చానని చెప్పింది. మరోవైపు సంగీత అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 
 
అయితే అరెస్టులతో న్యాయం జరగదని, ఇంటి దగ్గరకు వచ్చి పదిమందితో తనను కోడలిగా అంగీకరించాలని సంగీత కోరుకుంటోంది. అయితే ఈ కేసులో భర్త నుంచి మూడు కోట్ల భరణం కోరుతున్నట్లు తమకు తెలిసిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఆర్థిక పరమైన డిమాండ్లు తమ పరిధిలోకి రావని రాచకొండ సీపీ తెలిపారు.
 
మరోవైపు టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులు అవుతోందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకుండా పోయిందన్నారు.