1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. pawan sent bouquet to srinivas reddy

'జయమ్ము నిశ్చయమ్మురా'లో సూబర్బ్ సినిమా.. శ్రీనివాస్ రెడ్డికి పవన్ విషెస్

కమెడియన్ శ్రీనువాస్ రెడ్డిని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్‌గా "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమాని తిలకించారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగ

pawan
కమెడియన్ శ్రీనువాస్ రెడ్డిని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్‌గా "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమాని తిలకించారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా క్లీన్ లవ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 
 
'జయమ్ము నిశ్చయమ్మురా'లో "అత్తారింటికి దారేది" సినిమా కూడా ఒక కీ రోల్ పోషించింది. ఆ సినిమా బ్యాక్ డ్రాప్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని డిజైన్ చేశాడు దర్శకుడు శివాజి. ఆ సీన్స్‌కి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోనే పవన్ ఇమేజ్ కొన్ని సన్నివేశాలు బలం అందించింది.
 
జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ప్రేక్షకులను, విమర్శకులను బాగా మెప్పించింది. నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది. సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు లభించాయి. 
 
‘నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్’ అని అభినందిస్తూ ఒక ఫ్లవర్ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు పవర్ స్టార్. జయమ్ము నిశ్చయమ్మురా ఇచ్చి సక్సెస్‌తో, కొత్త సినిమాల మీద ఫోకస్ చేస్తూ బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, సడన్‌గా వచ్చిన పవన్ విషెస్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి చెబుతూ పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 
తర్వాతి కథనం
దైవ సన్నిధిలో ప్రారంభమైన "పెళ్లి కథ"