దైవ సన్నిధిలో ప్రారంభమైన "పెళ్లి కథ"
శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై అని శైని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పెళ్లి కథ’. నూతన నటీనటులు మనోహర్, తేజారెడ్డి జంటగా జి.యన్.మూర్తి (గునిశెట్టి) దర్శకత్వం
శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై అని శైని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పెళ్లి కథ’. నూతన నటీనటులు మనోహర్, తేజారెడ్డి జంటగా జి.యన్.మూర్తి (గునిశెట్టి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వడ్డి రామాంజనేయులు, కారెం వినయ్ ప్రకాష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని దైవ సన్నిధిలో లాంఛనంగా పెళ్లికథ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 నుంచి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని నిర్మాతలు తెలిపారు. పెళ్లి నేపథ్యంలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా రూపొందనుందని, ప్రేమతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ, ఇప్పటి ట్రెండ్‌కి, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాలు ఉండబోతున్నాయని దర్శకుడు తెలిపారు.
ప్రేమ, కుటంబ కథా చిత్రంగా రానున్న ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లేను జి.యన్.మూర్తి(గునిశెట్టి) అందించారు. అలానే ఈ పెళ్లి కథకు సంగీతం - యమ్.యమ్.కుమార్, డి.ఓ.పి- కళ్యాణ్ శ్యామ్ ఎడిటింగ్-సత్య గిడుతూరి, కో డైరెక్టర్-నాగ్ అద్దంకి, మాటలు-ఏకే జంపన్న, పాటలు- పుండరీ కాక్ష, సాయిశ్రీసిరి.