వానరంలో కారుణ్యం : కాకుల దాడి నుంచి పిల్లిపిల్లను రక్షించిన కోతి (video)

cat - monkey
Last Updated: మంగళవారం, 27 ఆగస్టు 2019 (19:16 IST)
నేటి కాలపు మనుషుల్లో కనీస మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. కానీ, ఆ వానరంలో మాత్రం దయా, దాక్షిణ్యం వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల తన కడుపున లేదా తమ జాతికి చెందిన పిల్ల కాకపోయినప్పటికీ.. ఓ పిల్లి పిల్లను ప్రాణాలతో కాపాడింది. అదీ కూడా తన ప్రాణాలకు తెగించి ఆ పిల్లి పిల్లను కాపాడింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, తెంలగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం చిన్న పిల్లిపిల్లను ఓ కాకుల గుంపు వెంటాడింది. దాన్ని చంపేసేందుకు కాకులన్నీ దాడి చేయడంతో ప్రాణభయంతో వణికిపోయింది.

దీన్ని దూరంలో చెట్టుపై నుంచి గమనించిన ఓ వానరం వెంటనే రంగంలోకి దిగింది. పిల్లి వెంటపడిన కాకులతో పోరాటానికి దిగింది. అయినా కాకులు పిల్లిని వదలక పోవడంతో సాహసం చేసి పిల్లిపిల్లను తన ఒడిలోకి తీసుకుని కాకుల్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. వానరం వద్ద తమ పప్పులు ఉడకవని భావించిన కాకులు చివరకు తీవ్ర నిరాశతో కావ్ కావ్ మంటూ అరుచుకుంటూ ఎగిరిపోయాయి.



దీనిపై మరింత చదవండి :