సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (19:00 IST)

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? పిల్లి బిర్యానీ వస్తుంది.. జాగ్రత్త.. ఎక్కడంటే? (Video)

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? కాస్త జాగ్రత్త పడండి. విశాఖ హోటళ్లలో పిల్లుల మాంసంతో బిర్యానీ వండుతున్నారనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. భక్తుల ముసుగులో హోటళ్లకు, రెస్టారెంట్లకు పిల్లి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో..  పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. 
 
ఆరుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాతో పాటు పోలీసులు వ్యానును కూడా పట్టుకున్నారని సమాచారం. పోలీసులు ఈ వ్యానులో ఒక చనిపోయిన పిల్లితో పాటు ఒక బ్రతికి ఉన్న పిల్లిని గుర్తించారు. చనిపోయిన పిల్లిని పోలీసులు పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. 
 
ముందుగా రెక్కీ నిర్వహించే ఈ ముఠా పిల్లులను వేటాడి.. ఆ మాంసాన్ని రెస్టారెంట్లకు అమ్ముతుంది. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది.
 
గతంలో కూడా చెన్నై నగరంలో పిల్లి మాంసం కలిపిన బిర్యాని విక్రయిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లే కాకుండా రోడ్డు పక్కన బిర్యానీ అమ్మేవారు ఎక్కువగా పిల్లి మాంసాన్ని చికెన్ ముక్కల్లో కలిపి విక్రయించారనే విషయం వెలుగులోకి వచ్చింది.