1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TRS MLA hand in Tahasildar Murder Case

తాహశీల్దారు హత్య కేసులో తెరాస ఎమ్మెల్యేల హస్తం!

Hyderabad
హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో అధికార తెరాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 
 
విజయారెడ్డిని ఆమె పని చేసే తాహశీల్దారు కార్యాలయంలోనే సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 
 
అయితే, విజయారెడ్డి మాట్లాడుతున్నట్టున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఆమె కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మంత్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు ఇందులో ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. విజయారెడ్డి హత్య దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కేసీఆర్ డెడ్‌లైన్‌కు భయపడొద్దు... జేజెమ్మ వచ్చినా ఆర్టీసీని క్లోజ్ చేయలేరు