సంబంధిత వార్తలు
- మానవాళి ఆరోగ్యం కోసం టిటిడి అద్భుత యాగం.. ఏంటది?
- శ్రీవారి ఆదాయం నిల్ - పాత నోట్ల మార్పిడికి పర్మిషన్ కావాలి : నిర్మలమ్మకు వైవీ వినతి
- తితిదేలో 91 మంది ఉద్యోగులు - తిరుమల యాత్ర రద్దు చేసుకుంటున్న భక్తులు
- టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా... సెక్యూరిటీకే ఎక్కువ..?
- తితిదే సిబ్బందికి కరోనా పాజిటివ్ - ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స
దేవుడా, ఆ టిటిడి వసతి సముదాయాలన్నీ కరోనా బాధితుల కోసమే
కరోనా విజృంభిస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకే కరోనా సోకడం.. 91 మందికి అధికారికంగా కరోనా సోకినట్లు స్వయంగా టిటిడి ప్రకటించడం.. ఇక స్థానికుల్లో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుండటం ఇదంతా భక్తులను ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి.
తిరుపతి లాంటి ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం టిటిడి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసేసుకుంది. భక్తుల కోసం కట్టిన వసతి సముదాయాలను ఏకంగా కరోనా బాధితులకు అందిస్తోంది. ఇప్పటికే టిటిడి ఉద్యోగస్తుల కోసం శ్రీనివాసం, మాధవం లాంటి వసతి గృహాలను కేటాయిస్తే తాజాగా బర్డ్ ఆసుపత్రిని కోవిడ్ బాధితులకు అందించేందుకు సిద్ధమైంది టిటిడి.
అంతేకాకుండా విష్ణునివాసంలోని 400 పడకలను కూడా కోవిడ్ బాధితులకే వినియోగించనున్నారు. కలెక్టర్ కోరిక మేరకు టిటిడి వసతి సముదాయాలను కోవిడ్ బాధితులకే అందించేస్తున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలన్నీ ప్రభుత్వానికి అందించనున్నారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు కోవిడ్ బాధితులకు ఉపయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
