శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (12:20 IST)

టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా... సెక్యూరిటీకే ఎక్కువ..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 22వేల మార్కును దాటేసింది. బుధవారం ఒక్క రోజే 1,062 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 264కు చేరుకుంది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్.. సుప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. 
 
టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తాజాగా, కరోనా బారిన పడిన సిబ్బందికి భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. 
 
కాగా, ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. వైరస్ బారిన పడిన వారిలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వైరస్ వ్యాప్తి ఈలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు.