శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: గురువారం, 9 జులై 2020 (10:33 IST)

టాలీవుడ్ యువ హీరో తండ్రి కరోనాతో మరణం

కరోనావైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల మృతి చెందారు. తాజాగా టాలీవుడ్ నటుడు ఈ రోజుల్లో ఫేం హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గారాంప్రసాద్ కరోనాతో కన్నుమూసారు.
 
గత 20 రోజులుగా విజయవాడలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా ప్రముఖ డైరెక్టర్ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈరోజుల్లో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత అతడు లవ్ సైకిల్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ తదితర సినిమాల్లో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమల్లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం విదితమే.