నరకం అనుభవించా.. మరణం మాత్రమే రాలేదు.. శ్రీశాంత్ చేదు అనుభవాలు

sreeshanth
sreeshanth
సెల్వి| Last Updated: శుక్రవారం, 3 జులై 2020 (22:33 IST)
ఫిక్సింగ్ ఆరోపణలు జీవితంపై విరక్తి కలిగించేవని.. స్పీడ్‌స్టర్ అనే పేరున్న శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ ఆరోపణలకు తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒత్తిడిలో వున్నప్పుడు మానసికంగా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని, జీవితంపైనే విరక్తి కలిగేదని చెప్పుకొచ్చాడు. ప్రతి క్షణం నరకం అనుభవించానని.. మరణం మాత్రమే రాలేదని చెప్పాడు.

దుర్భర జీవితం అనుభవించానని.. తన కారణంగా తన కుటుంబ సభ్యులు ఆలయానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో వుండేవారని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ దూరమైన తరువాత శ్రీశాంత్‌ సినిమాల్లో ప్రయత్నించాను.

అయితే అక్కడ కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. షార్జాలో సినిమా వాళ్ల క్రికెట్ జరిగినా తాను ఫిక్సింగ్ ఆరోపణలతో దూరమయ్యానని.. అప్పటికీ తనపై ఫిక్సింగ్ నీడలు తొలగిపోయానని తెలిపాడు. అయినా తనకు అవమానం తప్పదని శ్రీశాంత్ వివరించాడు.దీనిపై మరింత చదవండి :