శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:52 IST)

తాత, మనవడు కలిసి వెళ్తుండగా దాడి.. పిల్లాడిని అలా కాపాడిన జవాన్

Kashmir
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. భారత ఆర్మీ జవాన్లు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. అయితే ఓ జవాను చేసిన పనికి ప్రతి ఒక్కరు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. బుధవారం ఉదయం బారముల్లా జిల్లోలోని సోపోర్‌లో సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 
 
ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో పాటు పౌరుడు మరణించారు. అయితే ఓ తాత, మనవడు కలిసి వెళ్తుండగా, ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ పెట్రోల్‌ పార్టీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తాతతో పాటు ఓ మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు.
 
ఈ దాడిలో మూడేళ్ల బాలుడి తాత మరణించాడు. దీంతో ఉగ్ర కాల్పులకు బాలుడు తీవ్రభయభ్రాంతులకు గురయ్యాడు. ఇక తాత మరణించినా.. బాలుడిని కాపాడేందుకు రక్షణగా నిలిచాడు ఓ జవాను. ఆ బాలున్ని రక్షించి సురక్షితంగా ఇతర ప్రాంతానికి చేరవేశాడు. ఈ ఉగ్రదాడిలో మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. 
 
ఉగ్రవాదులతో పోరాడుతూ బాలున్ని కాపాడిన జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రక్తపు మడుగులో ఉన్న తాతను చూసి ఏడ్చుకుంటూ లేపే ప్రయత్నం చేశాడు. శవం వద్ద కూర్చుని ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. ఆ సమయంలో జవాను ఆ పిల్లాడిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.