శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (23:50 IST)

కీచక తండ్రి.. కూతుళ్లపై అత్యాచారం.. ఇంకా విటులను ఇంటికి తెప్పించి?

కరోనా వైరస్ ప్రపంచాన్ని విలవిల్లాడిస్తున్నా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. వయోబేధం లేకుండా.. వావి వరుసలు లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ కీచక తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అస్సాంలోని దిస్ పూర్ ప్రాంతంలో గత ఆరు నెలలుగా కన్న తండ్రే మద్యానికి బానిసై దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. 
 
కరోనా కారణంగా ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్న ఇద్దరు కూతుళ్లపై ఈ దుర్మార్గుడు ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు విటులను తెచ్చి వారి కోరికలను తీర్చమని బలవంతం చేసేవాడు. దీంతో ఇద్దరు యువతులు కుమిలిపోయారు. ఈ క్రమంలో చిన్నకూతురు ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు గమనించి ఆమె ప్రయత్నాన్ని భగ్నం చేశారు. 
 
ఆ క్రమంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయగా, అసలుగుట్టు బయటపడింది. కన్నతండ్రే అలా కీచకుడిగా మారడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.