1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayawada : Social workers arrested in prostitute scam

పేరుకే సోషల్ వర్కర్లు.. చేసేది వ్యభిచారం... ఎక్కడ?

సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన కొంతమంది మహిళలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Vijayawada
సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన కొంతమంది మహిళలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ పటమట దానయ్య బజారుకు చెందిన ఇద్దరు మహిళలు సమరం హాస్పటల్‌లో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. అయితే, వీరు తమ వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో మాటల్లో పడేసి.. వారిని వ్యభిచార రొంపిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. 
 
ఇందుకోసం దానయ్య బజారులోనే మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంట్లోనే వీరు వ్యభిచారం దందా నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయం ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో సీఐ ఉమామ హేశ్వరరావు సిబ్బందితో సోమవారం అర్థరాత్రి దాడిచేసి ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను అరెస్టు చేసి రూ.13 వేలు, 12 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
selvi
తర్వాతి కథనం
నాని "దేవదాసు"కు బిగ్‌బాస్ చిక్కులు... సినిమాను బహిష్కరించనున్నారా..?