1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Mumbai : Man held for molesting Australian on Hill Road

ఆస్ట్రేలియా యువతిని చూసి ముంబై యువకుడు టంప్ట్... వాటిని పట్టుకుని నొక్కేశాడు...

పట్టపగలు, జనసంచారం మెండుగా ఉన్న రోడ్డు ఫుట్‌పాత్‌పై నడిచివెళుతున్న ఆస్ట్రేలియాకు చెందిన అందమైన యువతిని చూడగానే ఆ కుర్రాడు తననుతాను నిగ్రహించుకోలేక పోయాడు.

Mumbai
పట్టపగలు, జనసంచారం మెండుగా ఉన్న రోడ్డు ఫుట్‌పాత్‌పై నడిచివెళుతున్న ఆస్ట్రేలియాకు చెందిన అందమైన యువతిని చూడగానే ఆ కుర్రాడు తననుతాను నిగ్రహించుకోలేక పోయాడు. వెంటనే ఒక్క పరుగున ఆ యువతి వెనుక చేరి... గట్టిగా హగ్ చేసుకుని వక్షోజాలను పట్టుకుని పట్టపగలు లైంగికంగా వేధించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఆస్ట్రేలియాకు చెందిన 20 యేళ్ల యువతి ఒకరు తన స్నేహితుడి పెళ్లి కోసం ముంబైకు వచ్చింది. ఆమె బాంద్రాలోని ఓ స్నేహితుడి ఇంట్లో బస చేసింది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు ముస్తాబై రోడ్డుమీదకు వచ్చింది. ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఖర్ ప్రాంతానికి ఆటోరిక్షా కోసం హిల్‌రోడ్డులోని ఫుట్‌పాత్‌పై నడచి వస్తోంది. అంతలో బాంద్రా ప్రాంతానికి చెందిన షేక్ అనే యువకుడు విదేశీ యువతిని సమీపించి ఆమెను పట్టుకొని హగ్ చేసుకుని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించాడు. 
 
పట్టపగలే జనం మధ్య యువకుడి లైంగిక వేధింపులపై ఆస్ట్రేలియా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను చూడగా యువతిని వేధించింది వాస్తవమని తేలింది. ఫలితంగా పోలీసులు నిందితుడైన షేక్‌పై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని బాంద్రా బస్టాండు వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కర్నాటక సీఎం కుమారస్వామి కోడలిగా బెజవాడ అమ్మాయి