ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:39 IST)

చెన్నై టి.నగర్ హోటల్లో డచ్ యువతి శవం... చంపేశారా? చచ్చిపోయిందా?

చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
టి.నగర్లోని వెంకటేశన్ స్ట్రీట్‌లో వున్న ఓ ప్రముఖ హోటలకి ఆమె సోమవారం వచ్చారు. తన పేరు లిండా ఐరెన్ హీజ్రెకర్ అనీ, తను ఓ జర్నలిస్టునని పరిచయం చేసుకుంది. గురువారం ఉదయం తను వెళ్లిపోతానని చెప్పింది. ఐతే మధ్యాహ్నం 12 దాటినా ఆమె గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళాలతో గది తలుపులు తెరిచి చూడగా ఆమె శవమై కనిపించింది. 
 
వెంటనే విషయాన్ని మాంబళం పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని ప్రాధమికంగా తేల్చారు. ఆమె బెడ్ పైన పొడిలాంటి పదార్థాన్ని కనుగొన్నారు. ఐతే ఆమెది ఆత్మహత్యా లేదంటే హత్యా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శవాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలికి వస్తాయని అంటున్నారు.