శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (08:58 IST)

తండ్రి హరికృష్ణ మరణవార్తవిని కుప్పకూలిన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్

తన తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విని టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కుప్పకూలిపోయారు. వారిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిద్దరిని వారించడం

తన తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విని టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కుప్పకూలిపోయారు. వారిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిద్దరిని వారించడం ఎవరితరం కాలేదు.
 
బుధవారం వేకువజామున 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి తన సొంత కారులో హరికృష్ణ బయలుదేరారు. ఆ తర్వాత ఓ గంట వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. 
 
కారు ప్రమాద వార్తను తెలుసుకున్న ఎన్టీఆర్, తన సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆయన పరిస్థితి అత్యంత విషమమని వైద్యులు స్పష్టం చేయడం, మరికొన్ని నిమిషాలకే, దుర్వార్తను ఆయన చెవిన వేయడంతో తండ్రి మృతదేహాన్ని చూస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు బోరున విలపించారు.
 
అలాగే, హరికృష్ణ మృతి వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీడీపీ అభిమానులు కామినేని ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటుండటంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, బందోబస్తును పెంచారు.