1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Actor Nandamuri Harikrishna Lost life in Road Mishap

హరికృష్ణ ఫ్యామిలీని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు.... మొన్న జానికిరామ్.. నేడు హరికృష్ణ (వీడియో)

సినీ హీరో, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు ఒక శాపంలా ఉన్నట్టుగా భావించాల్సివుంది. ఎందుకంటే గతంలో రోడ్

Actor Nandamuri Harikrishna
సినీ హీరో, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు ఒక శాపంలా ఉన్నట్టుగా భావించాల్సివుంది. ఎందుకంటే గతంలో రోడ్డు ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పించుకున్నారు. కానీ, హరికృష్ణ పెద్ద కుమారుడు జానికిరామ్‌ను రోడ్డు ప్రమాదమే మింగేసింది. ఇపుడు హరికృష్ణను కూడా రోడ్డు ప్రమాదమే పొట్టనబెట్టుకుంది.
 
2014 డిసెంబరు ఆరో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ చనిపోయారు. ఈ రోడ్డు ప్రమమాదం నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగింది. అంతకుముందు అంటే 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నీరులేని బావిలో పడింది. 
 
ఈ ప్రమాదంలో హీరో జూ.ఎన్టీఆర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఇపుడు కూడా ఇదే నల్గొండ జిల్లాలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలోనే హరికృష్ణ చనిపోవడం విధిరాతకాక ఏమనాలి. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.

 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తండ్రి హరికృష్ణ మరణవార్తవిని కుప్పకూలిన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్