శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (12:13 IST)

ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసా?

ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎసెన్షియల్ నూనె, షాంపూ, గులాబీ రేకులకు వేసుకోవాలి. ఈ నీటిలో పాదాలను 20 నిమిషాల పాటు అలానే ఉంచ

ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎసెన్షియల్ నూనె, షాంపూ, గులాబీ రేకులకు వేసుకోవాలి. ఈ నీటిలో పాదాలను 20 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత ప్యూమిన్ రాయితో కాళ్లను రుద్దుకోవాలి.
 
సెనగపిండి కొద్దిగా తేనె, పంచదార కలుపుకుని ముద్దలా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కొబ్బరినూనెతో తడుపుకుంటూ మృదువుగా పాదాలను రుద్దుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు చేసిన తరువాత చల్లని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. చివరగా గోళ్లను కత్తిరించుకుని ఆపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు అందంగా, కాంతివంతంగా కనిపిస్తాయి.