శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:39 IST)

26-08-2018 నుండి 01-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో రవిష కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, రాహువు, కేతువులు. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 27న కుజుడు వక్రత్యాగం. 1న శుక్రుడు తుల ప్రవేశం. ముఖ్యమైన పనులకు 29వ తేదీ తదియ బుధవార

కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో రవిష కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, రాహువు, కేతువులు. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 27న కుజుడు వక్రత్యాగం. 1న శుక్రుడు తుల ప్రవేశం. ముఖ్యమైన పనులకు 29వ తేదీ తదియ బుధవారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అనవసర జోక్యం తగదు. పొదుపు పథకాలకు అనుకూలం కాదు. ఆచితూచి వ్యవహరించండి. నమ్మకస్తులే వంచించే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలుగుతాయి. నూతన వ్యాపారులకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం, నగదు బహుమతి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేవివ్‌లు లక్ష్యాన్ని సాధిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు, పత్రాలా జాగ్రత్. గురు, శుక్ర వారాల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వృత్తుల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులే సాయం చేసేందుకు వెనుకాడుతారు. శనివారం నాడు ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. సోదరీసోదరులతో విభేదిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలు, శుభకార్యంలో పాల్గొంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమెుత్తం సాయం శ్రేయస్కరం కాదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా పేయెుద్దు. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఒకే పని నిమిత్తం అనేకసార్లు తిరగవలసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రయాణం విరమించుకుంటారు. రచయితలు, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. అవకాశాలా చేజారినా ఒకందుకు మంచిదే. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతులు స్వీకరిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు సామాన్యం. ఆది, గురు వారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విదేశీ చదువుల కోసం శ్రమిస్తారు. విద్యా ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. పొదుప పథకాలు పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. కృషి ఫలిస్తుంది. సమర్థతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. మంగళ, శనివారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ట
మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బంధువులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమెుత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరనీ నొప్పించవద్దు. కొత్త పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గురు, శుక్ర వారాల్లో పనులు ప్రారంభంలో చికాకులెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు అధికం, అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుకాదు. దంపతుల మధ్య సఖ్యత లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించకపోవచ్చు. విద్యా ప్రకటనల పట్ల ఏకాగ్రత వహించండి. దళారులను విశ్వసించవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో చుక్కెదురవుతుంది. పదవుల నుండి తప్పుకుంటారు. అధికారులకు హోదా, బాధ్యతల మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. 
 
మకరం: ఉత్తరాషాప 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సన్నిహితుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితాలిస్తాయి. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాల ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వేడుకలకు సన్నాహులు సాగిస్తారు. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. గృహమార్పు చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రయాణం తలపెడుతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకలు, శుభకార్యల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాకారులుక ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.