గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:25 IST)

శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్- ఆవకాయ ఎర్రగా వుందని ముఖానికి?

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచై

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది. 
 
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌ల మధ్య చైతూ నలిగిపోతాడని ట్రైలర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పృథ్వీ, వెన్నెల కిశోర్‌ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.