1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Villagers resolution on Badvel by election Boycott

ఓటు వేయించుకుని ముఖం చేస్తున్నారు .. అందుకే బైపోల్‌ను బహిష్కరిస్తున్నాం...

Badvel by election Boycott
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇందులో అధికార వైకాపాతో పాటు.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నాయి. జనసేన పార్టీ ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఈ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని స్పష్టంచేశారు. 
 
గత 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏ నాయకుడు తమ గ్రామం వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి అనుమతించమని హెచ్చరించారు. గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు పెట్టారు.  
తర్వాతి కథనం
రెండో పెళ్లి కోసం 9 నెలల బాబును అమ్మేసింది..