గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (15:02 IST)

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఉద్యోగులకు జీతాలివ్వలేదని..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాదిగా బిల్లులు చెల్లించలేదని హైకోర్టుని ఆశ్రయించిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు... తమకు న్యాయం చేయాలని కోరాయి. బిల్లుల చెల్లించాలని గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కానీ సమయం కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కారు. 
 
పిటిషన్‌ను నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, నయనాల జయసూర్య బెంచ్ విచారించింది. నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. బకాయిలు రాక కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది అని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు లోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది.