1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. vinukonda bjp leader attacked while morning walk

మార్నింగ్ వాక్ కి వెళ్తే... బీజేపీ నేతపై క‌ర్ర‌ల‌తో దాడి

bjp
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ బిజెపి అధ్యక్షుడు మేడం రమేష్ ఈ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్ళిన సమయంలో కొందరు కర్రలతో దాడి చేశారు. ఆయ‌న తీవ్ర‌గంగా గాయ‌ప‌డ‌టంతో ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ సంఘ‌ట‌న‌ను ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాలు,ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం ఆవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు.

నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడుని సత్వరమే వినుకొండ వెళ్లి, సమగ్ర సమాచారం సేకరించాలని, రమేష్ కు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సోము వీర్రాజు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులను రక్షించుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, వెంటనే జిల్లా ఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తర్వాతి కథనం
కాందహార్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. వీధుల్లోనే నిద్రిస్తున్న చిన్నారులు