సంబంధిత వార్తలు
- కుండపోత వర్షం.... తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం..
- హోటల్లో విచ్చలవిడిగా ఎంజాయ్... చాందినీ జైన్ కేసులో షాకింగ్ విషయాలు
- టెన్త్ క్లాస్ నుంచే లవ్... అమీన్పూర్ గుట్టలే వారిద్దరి హనీమూన్ స్పాట్...
- ఫేస్ క్రీమ్ కొనేందుకు మెడికల్ షాపుకు వెళ్తే... బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించి?
- ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి గుట్టల్లో పడేశారు.. మరో విద్యార్థి కూడా...
పర్యాటకం మాటున అశ్లీలం... హైదరాబాద్ టు సూర్యలంక...
పర్యాటకం మాటున అశ్లీలం నృత్యాలు పెరిగిపోయాయి. ఇవి హైదరాబాద్ నుంచి సూర్యలంక వరకు విస్తరించాయి. హైదరాబాద్‌లో ఫాంహౌస్, రిసార్ట్స్‌లలో రహస్యంగా నిర్వహించే ముజ్రా నృత్యాల సంస్కృతి ఇపుడు ఏపీ రాజధాని అమరావత
పర్యాటకం మాటున అశ్లీలం నృత్యాలు పెరిగిపోయాయి. ఇవి హైదరాబాద్ నుంచి సూర్యలంక వరకు విస్తరించాయి. హైదరాబాద్‌లో ఫాంహౌస్, రిసార్ట్స్‌లలో రహస్యంగా నిర్వహించే ముజ్రా నృత్యాల సంస్కృతి ఇపుడు ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న సూర్యలంక వరకు చేరింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న బీచ్ సూర్యలంక. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక శాఖ రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు రిసార్ట్స్ ఈ ప్రాంతంలో వెలిశాయి. శుక్ర, శని, ఆదివారాలు ఇవి కిటకిటలాడుతుంటాయి. ఎక్కువగా యువత వారాంతంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సరదాగా గడిపి వెళ్తుంటారు.
హైదరాబాద్ పరిసరాల్లో ముజ్రా నృత్యాలు, రేవ్ పార్టీల సంస్కృతి పెరిగిపోయింది. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. గోవా నుంచి ఈ సంస్కృతి విస్తరించింది. ఇది చిన్నగా సూర్యలంకకు చేరింది. ఇక్కడ అయితే పెద్దగా పోలీసుల నిఘా ఉండదని భావించి హైదరాబాద్ నుంచి వస్తున్న కొందరు పర్యాటకులు ముజ్రా నృత్యాల పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇక్కడ బీచ్‌కు వెళ్లే రహదారిలో రామ్‌నగర్ సమీపంలో శివ రిసార్ట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 8 మంది యువతులు అశ్లీల నృత్యాలు చేస్తుండగా అర్థరాత్రి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ముజ్రా నృత్యాలతో పార్టీ చేసుకుంటున్న సంగారెడ్డికి చెందిన 22 మందిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ.. వారాంతాల్లో అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి.
