1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:09 IST)

కుండపోత వర్షం.... తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం..

హైదరాబాద్ మరోమారు తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మరోమారు కుండపోత వర్షం పడుతోంది.

హైదరాబాద్ మరోమారు తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మరోమారు కుండపోత వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జ‌ల‌మయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది.
 
దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి మోకాలి లోతులో నీళ్లు రావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ‌మణికొండ, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట సహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేసింది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో భారీ వర్షం పడగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆ దెబ్బ నుంచి ఇప్పటివరకు తేరుకోనేలేదు. అంతలోనే మళ్లీ పగబట్టినట్టు వరుణుడు రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురిపిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.