సంబంధిత వార్తలు
- వరద బాధితులకు అండగా అక్షయ పాత్ర.. ఖాతాలో అరుదైన రికార్డ్
- పోలీసుల విచారణకు డుమ్మ కొడుతున్న జోగి రమేష్.. అరెస్టు తప్పదా?
- చంద్రబాబు ఇంటిపై దాడి కేసు : జోగి రమేష్‌కు పోలీసుల నోటీసు!!
- పారాథైరాయిడ్ క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స
- మంగళగిరి కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పొలిట్‌బ్యూరో భేటీ...
వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు.. నందిగం సురేశ్‌కు రిమాండ్
విజయవాడ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసు విచారణ శరవేగంగా సాగుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వైకాపా నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వైకాపా నేతలను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గురువారం ఉదయం వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత మరో వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. అప్పిరెడ్డిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నారు.
కాగా, నందిగం సురేశ్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు, ఈ దాడి కేసులో సంబంధం ఉన్న వైకాపా నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేయగా, ఈ బృందాలు ఈ వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
