సంబంధిత వార్తలు
- జగన్ కోసం మానవబాంబుగా మారిపోతా : టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్
- ఆంధ్రాలో రాళ్లతో కొట్టుకుంటున్నారు... టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
- ఒక రాయితో మూడు గాయాలు ఎలా తగులుతాయి? ఆనం వెంకటరమణారెడ్డి
- అబ్బబ్బా... జగన్‌కు గులకరాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా? : పవన్ కళ్యాణ్
- జగన్ వర్సెస్ షర్మిల.. అమెరికాకు వెళ్ళిపోయిన వైఎస్ విజయమ్మ?
ర్యాలీకి పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. మండదా? అందుకే రాయితో కొట్టాను???
సీఎం జగన్ బస్సు యాత్రా ర్యాలీలో పాల్గొనేందుకు పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అందుకే తనకు మండి జగనన్నను రాయితో కొట్టాల్సివచ్చిదని జగన్‌పై గులక రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. "ర్యాలీకి పిలిచి 350 రూపాయలు, లిక్కర్ బాటిల్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదనీ, అందుకే జగనన్నను రాయితో కొట్టాల్సివచ్చింది అంటూ నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే, ఈ నిందితుడుని అదుపులోకి తీసుకున్న అంశంపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీనలో కీలక సమాచారం లభించినట్టు సమాచారం.
కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఫుట్‌పాత్‌పై వేసే టైల్స్‌తో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి.. సడెన్‌గా సీఎంపైకి ఆ రాయిని విసిరినట్టు తెలుస్తుంది. ఈ దాడి కేసులో మంగళవారం ఉదయం సత్తిపాటు అతని పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయాలపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
